ఢిల్లీలో ప్రపంచంలోనే మొదటిసారిగా రోబోటిక్ సిరామిక్ కీళ్ల మార్పిడి

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

ఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా యాక్టివ్ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ మరియు నాన్-మెటాలిక్ సిరామిక్ కీళ్ల మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. మాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ ఛైర్మన్ డాక్టర్ సుజ భట్టాచార్జీ మరియు జర్మన్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ మైఖేల్ వాగ్నర్ ఈ సరికొత్త వైద్య ప్రక్రియ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ అత్యాధునిక విధానం ద్వారా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో అత్యున్నత కచ్చితత్వం సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు.