ప్రైవేట్ వర్సిటీల్లో ఎంటెక్ ప్రభుత్వ కోటా సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంటెక్ కోర్సుల్లో ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యాశాఖ అనుమతినిచ్చింది. నాలుగు ప్రముఖ ప్రైవేట్ వర్సిటీల పరిధిలో మొత్తం 219 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎస్ఆర్ఎం వర్సిటీలో 39, విష్ణు ఉమెన్స్ వర్సిటీలో 41, ప్రగతి వర్సిటీలో 54, ఆర్వీఎస్ వర్సిటీలో 85 సీట్లను కేటాయించగా, త్వరలో జరిగే కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు.