వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రిపోర్టర్: మహేష్
స్థలం: అనకాపల్లి
వాయుగుండం ప్రభావం నేపథ్యంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ముందస్తు చర్యలను వేగవంతం చేశామని హోమ్ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ప్రజల భద్రత తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యతని ఆమె స్పష్టం చేశారు.