పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఏపీ: పరిశ్రమలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్న పవన్ కల్యాణ్
రిపోర్టర్: అశోక్
స్థలం: కాకినాడ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మార్చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని మండిపడ్డారు. పర్యావరణ హితంగా పెట్టే ప్రతి పెట్టుబడికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని, పారిశ్రామికవేత్తలు పరిసర గ్రామాల అభివృద్ధి బాధ్యతను కూడా తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.