రూ. యాభై వేల కోట్ల భూమిపై సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

రంగారెడ్డి జిల్లా మియాపూర్లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని ఐదు వందల యాభై ఎకరాల భూమిపై సర్వహక్కులూ ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు అత్యంత చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన ఘన విజయం ఇదని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు.