హైదరాబాద్లో తీవ్ర నీటి కొరత: భారీగా పెరిగిన ట్యాంకర్ల డిమాండ్

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని, జలమండలి ట్యాంకర్ల డిమాండ్ అసాధారణ స్థాయికి చేరిందని అధికారులు వెల్లడించారు. భూగర్భ జలాలు అడుగంటడంతో నగరవాసులు ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారని, రోజువారీ బుకింగ్స్ ఏడు వేలు దాటాయని స్పష్టం చేశారు. ట్యాంకర్ల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.