రాయికోడ్‌లో కలకలం: మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: సురేష్
స్థలం: రాయికోడ్
మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ చైతన్య కిరణ్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన బోయిని శేఖర్ గత నాలుగు నెలలుగా పరారీలో ఉండగా, గురువారం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. డబ్బుల కోసం ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని రిమాండ్‌కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.