పర్యావరణ పొల్యూషన్ నివారణకు కలిసికట్టుగా పోరాడాలి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వైరా

ముందు తరాలకు ఆదర్శంగా ఉండేలా మొక్కలు నాటి పర్యావరణ పొల్యూషన్ నివారణకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాడాలని వైరాలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక 13వ వార్డులో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను స్థానికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయలక్ష్మి, విద్యార్థులు, మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.