తిరుమల ప్రైవేటు వాహనాల ఆంక్షలపై తితిదే కీలక ప్రకటన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుపతి

తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తితిదే స్పష్టం చేసింది. రోజువారీ వాహనాల కోటాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. అవాస్తవ సమాచారాన్ని నమ్మి భక్తులు అయోమయానికి గురికావద్దని కోరింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తితిదే హెచ్చరించింది.