స్థానిక ఎన్నికల కీలక ఘట్టం: విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ రిజర్వేషన్ల గెజిట్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి వెల్లడించారు. జిల్లాలోని ఇరవై ఏడు మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఆమోదిస్తూ అధికారిక గెజిట్ను బుధవారం విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం ఇరవై ఏడు జడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు నాలుగు వందల నలభై తొమ్మిది ఎంపీటీసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.