దేశంలో మొట్టమొదటి ఓట్ చోరీ నెహ్రూదే: బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సంచలనం
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
దేశ చరిత్రలో మొట్టమొదటి ఓట్ చోరీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ద్వారానే జరిగిందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర విమర్శించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, సర్దార్ వల్లభభాయి పటేల్‌కు దక్కాల్సిన పదవిని ఓట్ చోరీ చేసి నెహ్రూ ప్రధాని అయ్యారని ఆరోపించారు. ఇండీ కూటమి చేపట్టిన మాక్ పార్లమెంట్ ను, ప్రతిపక్షాల తీర్మానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.