వ్యక్తిగత జీవితంపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై నటి మృణాల్ ఆవేదన

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న నిరాధారమైన పుకార్లు, తప్పుడు ప్రచారాలపై ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వినోదం కోసమే కొందరు తమ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మృణాల్ ఆవేదన వెల్లడించారు. ఎవరితోనైనా స్నేహంగా మెలిగితే దానిని వక్రీకరించి లవ్ అఫైర్స్ అంటూ ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తాను ఎప్పుడూ ఓపెన్గా ఉంటానని, సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటానని స్పష్టం చేశారు.