పుంగనూరు హింసపై వైకాపా ముసలి కన్నీరు: దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజం

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఎన్టీఆర్

పుంగనూరు, తిరుపతి, రాయచోటి ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, భౌతిక దాడులకు పాల్పడి, తిరిగి తామే బాధితులమంటూ ప్రభుత్వంపై బురదజల్లుతూ ముసలి కన్నీరు కార్చడం వైకాపాకు అలవాటుగా మారిందని దేవినేని ఉమామహేశ్వరరావు - మాజీ మంత్రి, మైలవరం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు సాగిస్తున్న హింసాత్మక రాజకీయాలపై ఆయన మండిపడుతూ, నిత్యం డ్రామాలు ఆడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.