విజయవాడ శాప్ దాడిపై గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Vijayawada

విజయవాడలోని శాప్ ఆఫీస్ వద్ద జరిగిన దాడిపై అన్ని ఆధారాలతో రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ తెలిపారు. లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెల్లడించారు.