టీజీసీసీసీలో జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ సదస్సు ప్రారంభం
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్ లోని టీజీసీసీసీలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ సదస్సు ప్రారంభమైందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు అధికారులు అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.