దేశంలో తొలిసారిగా జిల్లా స్థాయి కార్మిక మార్కెట్ అంచనాలు విడుదల

రిపోర్టర్: విజయ్ స్థలం: India

జాతీయ గణాంక కార్యాలయం శుక్రవారం దేశంలోనే తొలిసారిగా జిల్లా స్థాయి కార్మిక మార్కెట్ అంచనాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధి భాగస్వామ్యంలో ప్రాంతాల వారీగా భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. దాదాపు 58 శాతం జిల్లాల్లో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 40 శాతానికి పైగా ఉండగా అత్యధికంగా గుజరాత్‌లోని సూరత్ ముందంజలో నిలిచింది. అలాగే దేశంలోని మోస్తరు జిల్లాల్లో నిరుద్యోగ రేటు 0.5 శాతం నుంచి 5.5 శాతం మధ్య నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.