ప్రధాని మోదీ ప్రజాసేవకు పాతికేళ్లు పూర్తి కావడంతో వారణాసిలో ప్రత్యేక కార్యక్రమాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: వారణాసి
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ఎన్డీయే నేతలు పాల్గొన్నారు. టెక్నాలజీని పరిపాలనలో సమర్థవంతంగా అమలు చేస్తున్న ఏకైక ప్రధాని మోదీ అని చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరై కాశీ విశ్వనాథ్ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.