మంగంపేటలో ఏఐటీయూసీ రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రం ఆవిష్కరణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఓబులవారిపల్లి

ఓబుళవారిపల్లి మండలం మంగంపేటలో ఏపీఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ కరపత్రాన్ని విడుదల చేశారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో రైల్వేకోడూరు బత్యాల భవన్లో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులకు కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.