జెన్పాక్ట్ కార్యాలయంలో ఉద్యోగుల వేధింపుల కలకలం: సీనియర్ మేనేజర్పై తీవ్ర ఆరోపణలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని జెన్పాక్ట్ కార్యాలయంలో సీనియర్ మేనేజర్ వేధింపులపై ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారని రోహిత్ కోటాన పేర్కొన్నారు. చాతి నొప్పితో బాధపడుతున్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఒత్తిడి తెచ్చారని, సుదీర్ఘ పనిగంటలు, లింగ వివక్షతో మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర అంతర్గత విచారణ జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయని నివేదికలు వెల్లడించాయి.