శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల అనుచరుల అరాచకాలు మరియు దాడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Srikalahasti

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. స్థానికంగా ఒక మహిళపై దాడి చేయడమే కాకుండా ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా నాన్నకు స్నేహితుడని, నీ ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చంటూ బాధితురాలిని నిందితులు తీవ్రంగా బెదిరించినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.