అక్రమ సిగరెట్ల విక్రయం: భాకరాపేట ఎఫ్ఆర్ఓ వెంకటరమణ సస్పెన్షన్
రిపోర్టర్: సతీష్
స్థలం: చిత్తూరు
చిత్తూరు జిల్లా భాకరాపేట అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ఎన్. వెంకటరమణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సీజ్ చేసిన రూ. 50 లక్షల విలువైన అక్రమ సిగరెట్లను ప్రభుత్వానికి అప్పగించకుండా రహస్యంగా విక్రయించినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే పులివర్తి నానిల దృష్టికి వెళ్లడంతో, ప్రాథమిక విచారణ అనంతరం పీసీసీఎఫ్ వెంకటాచలపతి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.