గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియ తప్పనిసరి

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

గ్యాస్ వినియోగదారులు అందరూ తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ కొనసాగాలంటే ఈ ప్రక్రియ అత్యంత ముఖ్యమని అధికారులు తెలిపారు. రేపటితో ఈ గడువు ముగియనుండటంతో వినియోగదారులు వెంటనే స్పందించి గ్యాస్ ఏజెన్సీలు లేదా అధికారిక యాప్స్ ద్వారా ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోవాలని హెచ్చరించారు. గడువులోపు పూర్తి చేయనివారికి అక్టోబర్ మొదటి తారీకు నుంచి సబ్సిడీ నిలిచిపోతుందని అధికారులు స్పష్టం చేశారు.