డిసెంబర్ నెలలోనే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
డిసెంబర్ నెలలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రెటరీ గెజిట్ విడుదల చేశారు. నవంబరు 9న తుది ఓటరు జాబితా ప్రక్రియ పూర్తయిన వెంటనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పష్టం చేశారు.