'నిజాంను గొప్పగా అనడం సిగ్గుచేటు': బండి సంజయ్ ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: Telangana

తెలంగాణ ప్రజల ప్రాణాలను దోచుకున్న నిజాంను అసెంబ్లీలో గొప్పగా కీర్తించడం సిగ్గుచేటని బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. బైరాన్‌పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్‌లో వేలాది మంది ప్రజల చావులకు నిజాం పాలనే కారణమని ఆయన గుర్తుచేశారు. నిజాం పాలనను పొగిడే నాయకులు చరిత్రను మరచిపోవద్దని, అమరవీరుల త్యాగాలను అవమానించడం మానుకోవాలని బండి సంజయ్ కుమార్ ఘాటుగా నిలదీశారు.