వక్ఫ్ భూముల లీజుకు బోర్డు ఆమోదం: సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్ణయం
రిపోర్టర్: రమేష్
స్థలం: అనంతపురం
వక్ఫ్ ఆస్తులను స్థిరమైన ఆదాయ వనరులుగా మలచాలని నిర్ణయించినట్లు వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని సుమారు 192 ఎకరాల భూమిని సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు నిమిత్తం లీజుకు ఇవ్వాలని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా సంస్థకు భారీగా అదనపు ఆదాయం సమకూరడంతో పాటు భూ ఆక్రమణలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.