ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని శ్రీకాకుళం జిల్లా పోలీసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, బందోబస్తు చర్యలు పకడ్బందీగా అమలవుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.