ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు స్వీకరణ: జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రవీంద్ర ఘనత
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
పదవ తరగతి పరీక్షలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవరాయపల్లి రవీంద్రకు జిల్లాస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు లభించింది. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని తిక్కన భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల చేతుల మీదుగా రవీంద్ర ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.