వైద్య విద్య ప్రవేశాల నీట్ పీజీ సీట్ల మ్యాట్రిక్స్ విడుదల

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ సీట్ల మ్యాట్రిక్స్ను జాతీయ వైద్య కమిషన్ పరిధిలోని మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం అరవై నాలుగు వేల యాభై తొమ్మిది సీట్లు ఖరారయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.