ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో అమరావతి ఈ ఛాంపియన్స్ శుభారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: Amaravati

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో అమరావతి ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. వైజాగ్ ఫైర్ బర్డ్స్ తో జరిగిన మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో అమరావతి విజయం సాధించింది. ఓపెనర్ రంగ లక్ష్మి 71 బంతుల్లో అద్భుతమైన శతకం సాధించి టోర్నీ చరిత్రలో తొలి సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది.