కళింగపట్నం సమీపంలో తీరం దాటనున్న బంగాళాఖాతం వాయుగుండం

రిపోర్టర్: రమేష్ స్థలం: Srikakulam

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చుతూ కళింగపట్నానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో మూడు నాలుగు గంటల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.