కొరివి: కొత్త హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీధర్ గాదె
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ఎస్ఆర్ కళ్యాణమండపం ఫేమ్ దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కొరివి గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈశ్వర్ రాచిరాజు, నందు, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌కు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. కొత్త తరహా కథతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.