భారత్తో స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్కు సిద్ధమైన పనామా జట్టు

రిపోర్టర్: గోపి స్థలం: బెంగుళూరు

భారత్తో జరగనున్న స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ కోసం పనామా జట్టు బెంగళూరు చేరుకుంది. ఈ జట్టులోని 24 మంది ఆటగాళ్లలో 22 మంది యూరప్, లాటిన్ అమెరికా, అమెరికా వంటి దేశాల లీగ్లలో ఆడుతున్నట్లు మిడ్ఫీల్డర్ జోస్ రోడ్రిగ్జ్ తెలిపారు. ప్రపంచ రికార్డుల్లో 44వ స్థానంలో ఉన్న పనామా ఆటగాళ్ల అనుభవం తమకు సవాల్గా మారనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.