ఉదయగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో సెప్టెంబర్ 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వరికుంటపాడులో జరుగుతున్న ఏర్పాట్లను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.