కాలిపోతున్న పంటలు: రేవంత్ రెడ్డి వైఫల్యంతో కృత్రిమ కరువు సృష్టి
రిపోర్టర్: రాము
స్థలం: సిద్దిపేట
కరెంట్ ఉత్పత్తి చేయలేక, మోటార్లు నడపడం చేతగాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమ కరువును సృష్టించిందని హరీష్ రావు ఆఫీస్ (Harish Rao Office) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, పూర్తిగా ప్రభుత్వ చేతకానితనమే కారణమని మండిపడ్డారు. విద్యారంగం నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాలలోనూ కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని వారు ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడి చేశారు.