పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాలి: ఎస్పీ శ్రీనివాస రావు

రిపోర్టర్: సునీల్ స్థలం: జోగులాంబ గద్వాల

జిల్లా పోలీస్ కార్యాలయంలో తన ఛాంబర్లో కోర్టు డ్యూటీ అధికారులతో జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు సమీక్షా సమావేశం నిర్వహించారని ఎస్పీ జోగులాంబ గద్వాల (SP Jogulamba Gadwal) వెల్లడించారు. ఈ సందర్భంగా కేసుల్లో బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం, విశ్వాసం పెంపొందించే విధంగా అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆయన స్పష్టమైన సూచలు చేశారని పేర్కొన్నారు.