చింతగూడ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మైదా మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మైదా మల్లేష్ ను ఆదివారం ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందు నాయక్ మరియు ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధ్యక్షులుగా పానుగంటి శ్రీనివాస్, లకావత్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మునేసుల శంకర్, కార్యదర్శులుగా బీర్పూర్ తిరుపతి తదితరులను ఎన్నుకున్నారు.