వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
రిపోర్టర్: శివ
స్థలం: పశ్చిమ గోదావరి
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దూబచర్లలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను కించపరిచేలా మాట్లాడారని టీడీపీ నేత బోడిగడ్ల నాగరఘు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ వేదికలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.