నేరడి బ్యారేజీ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీకాకుళం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పూర్తిగా పునరుద్ధరించడంతో పాటు, నేరడి బ్యారేజీ పనులను త్వరలోనే ప్రారంభించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఐదేళ్ల విధ్వంసానికి చెక్ పెట్టి అన్నదాతలకు సాగునీరు అందిస్తామన్నారు.