ఏకీకృత సర్వీసు రూల్స్ సాధించేవరకు అండగా నిలుస్తామన్న మునగాల ఉపాధ్యాయులు
రిపోర్టర్: BHARADWAJ
స్థలం: మునగాల
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఉపాధ్యాయులు ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తక్షణమే ఏకీకృత సర్వీసు రూల్స్ ప్రవేశపెట్టి ఎస్జీటీ ఉపాధ్యాయులకు తగిన న్యాయం చేయాలని ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు కోరారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి మరియు పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సేవలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.