బ్రిటిష్ కాలం నాటి రామాయపట్నం అతిథిగృహం చారిత్రక వైభవం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నం బీచ్‌లో 1881లో బ్రిటిష్ హయాంలో నిర్మించిన అతిథిగృహం 145 సంవత్సరాలు గడిచినా చెక్కుచెదరలేదు. బకింగ్‌హాం కాలువ ద్వారా సరకు రవాణా చేసే కాలంలో దీన్ని నిర్మించారు. నాటి చారిత్రక ఆనవాళ్లుగా నిలిచిన ఈ భవనంలో ఇప్పటికీ కలెక్టర్లు, ప్రముఖులు బస చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.