వైద్యరంగంలో ఏఐ సాంకేతికతకు లండన్ వేదికగా అరుదైన అంతర్జాతీయ గుర్తింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో చేపట్టిన వినూత్న సాంకేతిక ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ వెల్లడించారు. ఈ నెల 18న లండన్ లో జరగనున్న హెల్త్ ఏఐ గ్లోబల్ గవర్నెన్స్ ఫోరమ్-2026కు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ఆహ్వానం అందింది. కృత్రిమ మేధ ఆధారిత వైద్య పరిష్కారాలను ప్రజారోగ్య సేవలకు అనుసంధానిస్తూ అమలు చేసిన కార్యక్రమాల విజయాలను ఇక్కడ వివరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.