పందిల్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు చేసిన సర్పంచ్
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి స్థానిక సర్పంచ్ తొడేటి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులోకి ట్రాక్టర్లు, ఆటోలు దిగడానికి భూమి చదును చేయించినట్లు తెలిపారు. గణేష్ మండప నిర్వాహకులు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాలని వారు సూచించారు.