పాలకుల విద్రోహ రాజకీయాల్లో చితికిపోతున్న తెలంగాణ విమోచన పోరాట చరిత్ర

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తి బిజెపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి మాట్లాడారు. సెప్టెంబర్ 17న తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచించాయని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటే, ఇక్కడ మాత్రం మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే సెప్టెంబర్ 17ను ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.