శ్యామ్ ఇనిస్టిట్యూట్‌లో పోలీసుల తనిఖీలు, ఛైర్మన్ ఆవేదన
రిపోర్టర్: శివ
స్థలం: కాకినాడ
కాకినాడ శ్యామ్ ఇనిస్టిట్యూట్‌లో వన్‌టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మెగా పోలీస్ నోటిఫికేషన్ డిమాండ్‌తో జరిగిన నిరసనకు విద్యార్థులను ప్రేరేపించారనే ఆరోపణలపై విచారణ జరిపారు. ముందస్తు సమాచారం లేకుండా దాడులు చేసి విద్యార్థులను భయాందోళనకు గురిచేశారని ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ ఆరోపించారు. ఆందోళనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, పోలీసులు నిజాయతీగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.