గోదావరి వరద ఉధృతితో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

రిపోర్టర్: కృష్ణ స్థలం: తూర్పు గోదావరి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి మళ్లీ వరద పోటెత్తుతోందని, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతుండటంతో 164 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్లు కీర్తి చేకూరి, దినేష్ కుమార్ పేర్కొన్నారు.