నెల్లూరు జైలులో ఖైదీలకు చదువు: కంప్యూటర్ శిక్షణతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

క్షణంపాటు చేసిన తప్పులతో కటకటాలపాలైన ఖైదీల జీవితాల్లో జైలు అధికారులు వెలుగులు నింపుతున్నారు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉన్నతాధికారుల అవగాహనతో చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రెండు వందలకు పైగా ఖైదీలకు కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జైలు నుంచి విడుదలయ్యాక సమాజంలో గౌరవంగా బతికేందుకు ఈ ధ్రువపత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన స్పష్టం చేశారు.