మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

రిపోర్టర్: గోపి స్థలం: వైఎస్ఆర్ కడప

వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు రూరల్ పరిధిలో రెండేళ్ల క్రితం జరిగిన మైనర్ బాలిక అత్యాచారం మరియు సజీవ దహన హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘోర నేరానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు అనగా యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని స్పష్టంగా ఆదేశించింది.