కెనైన్ హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న వంగలపూడి అనిత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అనకాపల్లి

అమరావతిలో జరిగిన కెనైన్ హ్యాండ్లర్ల 23వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొనడం ఎంతో గర్వంగా అనిపించిందని మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. నార్కోటిక్స్ కేసులు, హత్యల దర్యాప్తులో పోలీసు జాగిలాలు కీలక సేవలందించాయని ఆమె పేర్కొన్నారు. కనిపించకుండా పోయిన బాలికల ఆచూకీ గుర్తించడంలోనూ ఈ శ్వాస జాగిలాలు అద్భుతమైన సామర్థ్యాన్ని చాటాయని ఆమె ప్రశంసించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల దర్యాప్తులో పోలీసు శాఖకు ఈ జాగిలాలు అత్యంత విలువైన సహకారాన్ని అందిస్తున్నాయని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.