టీవ్‌టూ లీగ్‌ల వల్ల వన్డే క్రికెట్‌ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టీవ్‌టూ లీగ్‌ల ప్రభావం వల్ల భవిష్యత్తులో వన్డే క్రికెట్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాంచైజీ క్రికెట్‌ విస్తృతి కారణంగా 50 ఓవర్ల ఫార్మాట్‌ క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, అయితే అగ్ర దేశాలు ఆదరిస్తే టెస్టు క్రికెట్‌కు మాత్రం ఎలాంటి ముప్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.