నెల్లూరులో చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులను హెచ్చరించిన ఎస్పీ
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేదయపాలెం అయ్యప్పగుడి సెంటర్ మరియు చింతారెడ్డిపాలెం ఎస్ఎస్టీ చెక్పోస్టులను జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి ప్రలోభాలను అరికట్టాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అక్రమాల నివారణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.